Saturday, November 16, 2024

హైదరాబాద్‌లో హనీ ట్రాప్

- Advertisement -
- Advertisement -

కిలాడీ లేడితోపాటు తొమ్మిదిమంది అరెస్టు
ప్రధాన నిందితుడు డిస్మిస్డ్ హోంగార్డు
బ్లాక్‌మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు
వివరాలు వెల్లడించిన డిసిపి రాజేష్ చంద్ర

మనతెలంగాణ: హనీ ట్రాప్‌తో పలువురిని బ్లాక్‌మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మహిళతోపాటు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు, మూడు మొటార్ సైకిళ్లు, పది కత్తులు, రెండు డిమ్మీ పిస్తోళ్లు, 12 మొబైల్ ఫోన్లు, హోంగార్డు నకిలీ ఐడి కార్డును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డిసిపి రాజేష్ చంద్ర తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్‌కు చెందిన డిస్మిస్డ్ హోంగార్డు ఎండి వికార్ మెహిందీ ప్రధాన నిందితుడు. ఇతడిపై గతంతో చిక్కడపల్లి, పంజాగుట్టలో కేసులు ఉన్నాయి.

ఎండి ఇమ్రాన్ ఖాన్, ఎండి ఇస్మాయిల్, ఎండి అలీ, శ్రీమతి సయిదా ఉజ్మా ఫాతిమా, మజీద్ అహ్మద్, అహ్మద్‌రిజ్వాన్, సయిద్ రఫీక్, షేక్ బషీర్, ఎండి కలీం, ఎండి సిరాజ్ మెహిందీ, శ్రీమతి షేక్ సమీరా అలియాస్ హమీదా బీ ముఠాగా ఏర్పడ్డారు. సయిదా ఉజ్మా ఫాతిమా, షేక్ సమీరా యువకులు, అమాయకులైన వ్యాపారస్థులతో పరిచయం పెంచుకుని వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు దిగుతున్నారు. తర్వాత ఇంటికి లంచ్‌కు పిలిచి అప్పుడు సన్నిహితంగా ఉన్నట్లు నటించి ఫొటోలు తీసుకుంటున్నారు. వాటిని పట్టుకుని ఇద్దరు మహిళలు, ఈ ముఠా సభ్యులు యువకుల ఇంటి వద్దకు వచ్చి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు, డమ్మీ పిస్తోల్, కత్తులు చూపించి బెదిరిస్తున్నారు.

మహిళతో ఫొటోలు దిగి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇంటిపై దాడి చేసి హంగామా చేస్తున్నారు. అంతేకాకుండా ఫొటోలు, వీడియోలు న్యూస్ ఛాన్లకు ఇస్తామని, వెబ్‌సైట్లలో పెడుతామని బెదిరిస్తున్నారు. ఇవి చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు, తమ పరువు పోతుందని భావిస్తున్న బాధితులు లక్షలాది రూపాయలు ఈ ముఠాకు ఇస్తున్నారు. ఇలాగే పలువురు బాధితుల నుంచి ఈ ముఠా సభ్యులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బాధితుల ఫిర్యాదుతో…

ముషీరాబాద్‌కు చెందిన రైస్ వ్యాపారి సయిద్ కుంద్‌మీర్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. ఉజ్మాఫాతిమా ఫోన్లు చేసి ఫొటోలు తీసుకుంది. తర్వాత రూ.10లక్షలు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన బాధితుడు ఇంటిని కుదువబెట్టి నిందితులకు రూ.2.70లక్షలు ఇచ్చాడు. తర్వాత డబ్బులు డిమాండ్ చేయడంతో ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్, 2022లో క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్న ఖలీల్ పాషాను స్టేజ్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హీనా హనీ ట్రాప్ చేసింది. ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని, నీ ఇంటి ముందు చనిపోతానని బెదిరించింది. దీంతో బాధితుడు రూ.2.50లక్షలు వసూలు చేసింది. జూలై, 2022 ఉజ్మా, ఇబ్రహిం ఖాన్‌ను ట్రాప్ చేసింది. బాధితుడిని బెదిరించడంతో రూ.50,000 ఇచ్చింది. గాంధీనగర్‌కు చెందిన సూరజ్ సమంతాను జనవరి, 2023లో ఈ ముఠా బ్లాక్‌మెయిల్ చేయడంతో రూ. 50,000 ఇచ్చింది. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News