Saturday, November 23, 2024

టి-హబ్‌కు అవార్డు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రానికి మరో అత్యుత్తమ అవార్డు లభించింది. జాతీయ స్టార్టప్ డే పందర్బంగా బారత దేశంలో ఉత్తమ ఇంక్యుబేటర్ అవార్డును టిహబ్ సొంతం చేసుకుంది. తెలంగాణలో స్టార్టప్ ఎకోసిస్టమ్ వృద్ధికి తోడ్పాటునందించేందుకు చేసిన ప్రయత్నాలకు గాను ఈ అవార్డు లబించింది. కేంద్ర వాణిజ్యం,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ సమక్షంలో ఈ ఇన్నోవేషన్ హజ్‌ను ప్రధానం చేశారు. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్‌లో టిహబ్ సహకారుం జాతీయ స్థాయిలో ఇతర 55 ఇంక్యుబేటర్‌లతో పోటి పడి మొదటి స్థానంలో నిలిచింది. స్టార్టప్‌ల ద్వారా సేకరించిన నిధులు, సెక్టార్ ఫోకస్, బలమైన మార్కెట్, భాగస్వామ్యాలతో పాటు 25 వేలకు పైగా స్టార్టప్‌లలో విస్తరించి ఉన్న స్టార్టప్ ఏకోసిస్టమ్‌పై తదితర అంశాల ఆధారంగా ఈ ఎంపిక చేయడం జరిగింది.

టి హబ్ ప్రారంభమైనప్పటి నుండి టిహబ్ స్టార్టప్‌లు మూడు వేలకు పైగా బలమైన మార్కెట్ కనెక్షన్లు , 12వేలకు పైగా ఉద్యోగాల సృష్టితో దాదాపు 1.9 బిలియన్లను సేకరించడం జరిగింది. ఇతర ఇంక్యుబేటర్లతో పోల్చితే టిహబ్ సాధించింది అనసమానమైనది. టిహబ్ దాని వ్యాపార వృద్ధి, మార్గదర్శకత్వం, నిధులు, భాగస్వామ్యాలు, మార్కెట్ యాక్సెస్ అవకాశాల మద్దతును అందుకుంటోంది. ఇతర వ్యాపార వేత్తలకు రోల్ మోడల్‌గా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్కయం, ఐటి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరి జయేశ్ రంజన్ మాట్లాడుతూ సాధారణంగా ప్రభుత్వాలు ఈ రంగంలో రాణించవని, అయితే ఇతరుల ఉత్తమ అభ్యాసాలను అధ్యయనం చేయడం ద్వారా, వాటి ద్వారా నేర్చుకుని టిహబ్ రంగంలో జాతీయ స్థాయికి ఎదగవచ్చన్నారు. దేశంలో మరింత శక్తివంతమైన , విజయవంతమైన పర్యావరణ వ్యవస్థను అనుసరించడానికి ఇది బ్లూప్రింట్‌గా ఉపయోగపడుతుందన్నారు. ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా అవార్డును అందించడం గొప్ప గౌరవమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News