న్యూస్ డెస్క్: పాదచారులలో ఉత్సాహాన్ని నింపేందుకు కొందరు, తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు మరికొందరు కళాకారులు రోడ్లపైన పాటలు పాడడం, తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఇదో సంఘటన.. అయితే ఇక్కడ శ్రోతలు ఇద్దరు పోలీసులు కావడం విశేషం. కేరళలోని కొచ్చిలో ఇటీవల జరిగింది ఈ సంఘటన. మెరైన్ డ్రైవ్ వాక్‌వే వద్ద ఒక యువకుడు గిటార్ వాయిస్తూ పాడిన పాటకు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మంత్ర ముగ్ధులై పోయారు.
దీన్ని కొందరు పాదచారులు తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీయగా ఆ వీడియోను కొచ్చి పోలీసులు తమ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అంబిలి అనే మలయాళ చిత్రంలోని ఆరాధికే అనే ఆ పాట చాలా జనాదరణ పొందిన పాట. ఆ పాటకు ప్రాణం పోసిన ఆ యువకుడి వీడియోను జనవరి 13న పోలీసులు పోస్ట్ చేయగా ట్విటర్‌లో ఇప్పటివరకు 8 వేలకు పైగా వూస్ సంపాదించుకుంది.
മഞ്ഞുതിരും വഴിയരികേ…
ഹോവർ പട്രോളിംഗ് @ കൊച്ചിഈ സ്നേഹ സംഗീതത്തിന് നന്ദി…
വീഡിയോ കടപ്പാട്: Minhaj pic.twitter.com/h0mcIUFFlf
— Kerala Police (@TheKeralaPolice) January 13, 2023