Saturday, December 21, 2024

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సిఎంలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోపాటు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. బుధవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సిఎంలు.. అక్కడి నుంచి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, అర్చకులు సిఎంలకు ఘన స్వాగతం పలికారు.అనంతరం సిఎంలు లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకున్నారు.దర్శననంతరం సిఎంల వేదపండితుల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు సిఎంలు బయల్తేరి వెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News