Monday, December 23, 2024

అమ్మాయి విషయం బయట పడుతుందన్న భయంతో.. యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

నింద భారమై తాడుకు వేలాడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని విందు ఫ్యామిలీ రెస్టారెంట్ లో సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన మైళ్ళ భరత్ (19) అనే యువకుడు వరసకు కూతురయ్యే అమ్మాయితో చనువుగా ఉంటూ ఫోన్లో చాటింగులు చేస్తూ ఉండేవాడని వరుసకు కూతురు కావడంతో తప్పుగా భావించి వెనక్కి తగ్గాడని తెలిపారు.

ఇది ఇలా ఉండగా గత రెండు రోజుల క్రితం వారి ఇంటి పరిసరాలలో ఒక వస్తువు పోవడంతో అట్టి విషయంలో ఇరుకుటుంబ సభ్యులు మాట మాట పెరిగి ఇందులో బాలిక ప్రస్తావం రావడంతో అమ్మాయి విషయం బయట పడుతుందన్న భయంతో తను పనిచేస్తున్న హోటల్లోనే తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News