Friday, December 20, 2024

హెచ్‌ఎండిఎ ప్లాట్ల వేలానికి స్పందన కరువు!

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణలోని వేర్వేరు జిల్లాల్లో ఉన్న 38 ప్లాట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఎ) బుధవారం ‘ఈ-ఆక్షన్’ నిర్వహించింది. అయితే గండీపేట్‌లోని ప్లాటు చదరపు గజానికి రూ.1.11 ధరపలికినప్పటికీ, మొత్తం మీద వేలానికి పేలవమైన ప్రతిస్పందనే వచ్చింది. హెచ్‌ఎండిఎ వేలం ద్వారా రూ. 750 కోట్లు వస్తాయని ఎదురుచూసినప్పటికీ కేవలం రూ. 195.24 కోట్లే వచ్చాయి.

కేవలం తొమ్మిది ప్లాట్లే అమ్మడయ్యాయి:
32730 చదరపు గజాల తొమ్మిది ప్లాట్లే అమ్ముడుపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీనాపూర్, పటాన్‌చెరు, రామచంద్రపురం, జిన్నారంలో ఉన్న ప్లాట్లు, మెడ్చేల్‌మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, బాచుపల్లి, కుకట్‌పల్లి, గండి మైసమ్మలో ఉన్న ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలోని గండీపేట్, శేర్లింగంపల్లిలో ఉన్న ప్లాట్లు వేలం వేయబడ్డాయి. వేలాన్ని ఉదయం, మధ్యాహ్నం… రెండు సెషన్లలో నిర్వహించారు. మొదటి సెషన్‌లో రంగారెడ్డి జిల్లాలోని 10 ప్లాట్లు, మెడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలోని ఎనిమిది ప్లాట్లు, మూడు నాలుగు ల్యాండ్ పార్సల్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక మధ్యాహ్నం సెషన్‌లో సంగారెడ్డి జిల్లాలోని 17 ప్లాట్లలో కేవలం రెండు ప్లాట్లే అమ్మడయ్యాయి.
హైదరాబాద్‌లోని ఫ్లాట్లకు టోకెన్ అడ్వాన్సులు
హైదరాబాద్‌లోని ఫ్లాట్లకు స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. దాంతో హెచ్‌ఎండిఎ టోకెన్ అడ్వాన్స్‌ను సమర్పించే తేదీని పొడగించింది. బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్ ఫ్లాట్లకు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చే తేదీని పొడగించారు. త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కు రూ. 3 లక్షలు, టూ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కు రూ. 2 లక్షలు, సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కు రూ. 1లక్ష టోకెన్ అడ్వాన్స్‌గా నిర్ణయించారు. ఈ టోకెన్ అడ్వాన్స్‌ను ఫిబ్రవరి 15లోగా మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్‌ఎండిఎ పేరిట డిడి రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఫ్లాటు కొనాలా లేక ప్లాటు కొనాలా…ఏది భేషు?
హైదరాబాద్‌లో స్వంత ఇల్లు ఉండాలనుకునేవారు చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఫ్లాటు కొనాలా? లేక ప్లాటు కొనాలా అనే మీమాంసకు కూడా గురవుతుంటారు. అయితే వారి వారి అవసరాలను బట్టి ఎవరికి ఏదీ సరిపోతుందో దానినే ఎంచుకోవాలి. వెంటనే గృహప్రవేశం చేసేయాలనుకునేవారు ఫ్లాట్ కొంటారు. అది కూడా హైదరాబాద్‌లోని ప్రైమ్ లొకేషన్‌లో ఉండాలని కోరుకుంటుంటారు. కానీ ఫ్లాట్ల లైఫ్ టైమ్, వచ్చే వాటా (చదరపు అడుగులలో), ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఫ్లాట్లు కొంటే మంచింది. ఫ్లాట్లలో ఇతర కుటుంబాలతో అనేక విషయాల్లో సర్దుకుపోవలసి ఉంటుంది.  ప్రైవసీ అంతగా ఉండదు. ఇకపోతే  ప్రైవసీని కోరకునే వారు ప్లాట్లు కొనుకున్ని స్వంత ఇల్లు కట్టుకోడానికే మొగ్గుచూపుతుంటారు. కానీ నేడు ఇల్లు కట్టుకోవడం చాలా వ్యయంతో కూడిన పని.  బాగా డబ్బున్న వాళ్లే ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోను వీలవుతుంది. ఎవరైతే తమ పరిధిని ఇతరులతో పంచుకోకూడదనుకుంటారో, తమ ప్రత్యేకత, ప్రైవసీలకు ప్రాధాన్యత ఇస్తారో అలాంటి వారు ఇండిపెండెంట్ ప్లాటును కొనుక్కోవడమే బెటర్. ప్లాటు కొనుక్కునే వారికి ప్రయోజనం ఏమిటంటే వారికంటూ పెరడు ఉంటుంది. కారు పార్కింగ్ స్థలం వంటివి కూడా ఉంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News