Friday, December 20, 2024

యుపిలో బురఖాతో కళాశాలకు వచ్చిన విద్యార్థినుల అడ్డగింత

- Advertisement -
- Advertisement -

మొరాదాబాద్(యుపి): యూనిఫారమ్ అమలులో ఉన్నప్పటికీ దాన్ని ధరించకుండా బురఖా ధరించి కళాశాలకు వచ్చిన కొందరు విద్యార్థినులను లోపలకు ప్రవేశించకుండా ఇక్కడి మిందూ కళాశాల అధికారులుబుధవారం అడ్డుకున్నారు. తమను బురఖాతో లోపలకు రానివ్వడం లేదని, కళాశాల ప్రవేశ ద్వారం వద్దనే బురఖా తొలగించాలని అధికారులు చెబుతున్నారని కొందరు ముస్లిం బాలికలు నిరసన తెలియచేశారు.

కాగా..బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులకు సమాజ్‌వాది ఛాత్ర సభ కార్యకర్తలు మద్దతు తెలిపారు. విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించాలని వారు వాగ్వివాదానికి దిగినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తాము వ్యవహరించలేమని కళాశాల ప్రొఫెసర్లు తెగేసి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందూ కళాశాల విద్యార్థులకు తాము ఒక డ్రెస్ కోడ్ అమలు చేశామని, దాన్ని పాటించని వారిని కళాశాలలోకి అనుమతించబోమని కళాశాల ప్రొఫెస్ డాక్టర్ ఎపి సింగ్ తెలిపారు.

దీనిపై ఛాత్ర సభ కార్యకర్తలు స్పందిస్తూ డెస్ కోడ్‌లో బురఖాను కూడా చేర్చాలని కోరుతూ కళాశాల అధికారులకు ఒక వినతిపత్రం సమర్పించారు. గత ఏడాది కర్నాటకలోని ఉడుపి జిల్లాలో కూడా ఇదేరకమైన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రభుత్వ బాలికల పియు కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినులు డ్రెస్ కోడ్‌ను కాదని హిజాబ్ ధరించి కళాశాలకు రావడంతో వారి ప్రవేశాన్ని కళాశాల యాజమాన్యం అడ్డుకుంది. ఇది తీవ్ర దుమారం రేపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News