Monday, December 23, 2024

నెలకు రూ. 1500 ఎప్పుడిస్తారు: రాహుల్‌ను అడిగిన హిమాచల్ మహిళ

- Advertisement -
- Advertisement -

 

ఇండోర: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం ఆదయం 7 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లా ఇందోర అసెంబ్లీ నియోజకవర్గంలోని మాన్సెర్ గ్రామాన్ని చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, ఉప ముఖ్యమంత్రి ముకేష్ అగ్నిహోత్రి, పిసిసి అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఇతర సీనియర్ నాయకులు రాహుల్‌కు స్వాగతం పలికారు. 11 కిలోమీటర్లు నడిచిన అనంతరం రాహుల్ బృందం మహోట్ గ్రామంలో భోజన విరామం కోసం మూడు గంటలపాటు సేదతీరింది.

ఈ సంద్భంగా రాహుల్ అక్కడ గ్రామీణ మహిళలతో కొద్దిసేపు ముచ్చటించారు. కొంతమంది మహిళలు వంటగ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని రాహుల్‌ను కోరారు. మరికొందరైతే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన మేరకు మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున నగదు పంపిణీని ఎప్పటి నుంచి ఇస్తారంటూ రాహుల్‌న ప్రశ్నించారు. త్వరలోనే నెలకు రూ. 1,500 చొప్పున నగదు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాహుల్ వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News