- Advertisement -
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఒయు వైస్ ఛాన్స్‌లర్ డి. రవిందర్ యాదవ్ గురువారం ఫలితాలు విడుదల చేశారు. 47 సబ్జెక్టుల్లో పిహెచ్‌డి ప్రవేశాల కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,776 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,656 మంది పరీక్షకు హాజరు కాగా, వారిలో 1,508 మంది(22.66శాతం) అర్హత సాధించారు.
అభ్యర్థుల వ్యక్తిగత ర్యాంకులు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.osmania.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని విసి తెలిపారు. పోస్టు ద్వారా ఎలాంటి ర్యాంక్ కార్డులు పంపబడవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.లక్ష్మీనారాయణ, ఒఎస్‌డి బి. రెడ్యానాయక్, అడ్మిషన్స్ డైరెక్టర్ పాండురంగారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీనగష్, వర్దిని, ప్యాట్రిక్ పాల్గొన్నారు.
- Advertisement -