- Advertisement -
హైదరాబాద్: జగద్గిరిగుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో యువదంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను కర్నూలు జిల్లాకు చెందిన బ్రహ్మచారి, మౌనికగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
- Advertisement -