Monday, January 20, 2025

దక్కన్ మాల్ ప్రమాదంలో ముగ్గరు వ్యక్తులు సజీవ దహనం..

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ లో నిన్న దక్కన్ మాల్ జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. వసీద్, జునైద్, జహీర్ అనే ముగ్గురు యువకులు షటర్స్ తీసేందుకు లోపలికి వెళ్ళి ఘటన సమయంలో మంటలో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో కాలిబూడిద అవడంతో మృతదేహాలను క్లూస్ టీం అధికారులు పరిశీలిస్తున్నారు. ఎఫ్ ఎస్ ఎల్ ,డిఎన్ఎ రిపోర్టు ఆధారంగా మృతదేహాల అవశేషాలను గుర్తించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News