- Advertisement -
టోబోలిసి: ఓ మాజీ సైనికుడు తన ఇంట్లోని బాల్కానీ నుంచి ఐదుగురిని తుపాకీతో కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన జార్జియా దేశం టోబోలిసిలోని సాగరజో ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి జార్జియా దేశంలో సైనికుడిగా విధులు నిర్వహించాడు. కొన్ని రోజులు ఆఫ్ఘానిస్థాన్‌లో జార్జియన్ సైనికుడిగా పని చేసి పదవీ విరమణ పొందాడు. తన ఇంట్లో నుంచి బాల్కనీలోకి వచ్చి ఐదుగురిపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులలో ఓ పోలీస్ అధికారి ఉన్నట్టు గుర్తించారు. సదరు సైనికుడికి షూటర్‌గా మంచి గుర్తింపు ఉంది.
- Advertisement -