Saturday, December 21, 2024

కోస్తా తీరాన్ని కబళిస్తున్న సముద్రం

- Advertisement -
- Advertisement -

ప్రపంచం మొత్తం మీద సరాసరి కన్నా భారత కోస్తా సముద్ర మట్టాలు అత్యంత వేగంగా పెరిగిపోతున్నాయని, ప్రపంచ వాతావరణ సంస్థ వాతావరణ 2021 నివేదిక వెల్లడించింది. 2022 మే 18న ఈ నివేదిక విడుదలైంది. పశ్చిమ కోస్తాతో పోల్చుకుంటే తూర్పు కోస్తా తీర ప్రాంత భూములు ఎక్కువగా సముద్ర అలల ప్రభావంతో కోతకు గురవుతాయని హెచ్చరించింది. ఏడాదికి తూర్పు కోస్తాలో 3 మీటర్ల కన్నా ఎక్కువ కోతకు గురి కాగా, పశ్చిమ కోస్తాలో 2.5 మీటర్ల వంతున భూమి కోతకు గురవుతుందని పేర్కొంది. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఫలితంగా అనేక వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఇవే సహజంగా తీర భూములు కోతకు గురయ్యేలా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా రేవులు, ఆనకట్టల నిర్మాణం, కోతను నివారించడానికి పటిష్టమైన నిర్మాణాలు వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. భూశాస్త్ర మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ కోస్తా పరిశోధన కేంద్రం ( ఎన్‌సిసిఆర్) డైరెక్టర్ ఎంవి రమణమూర్తి దీనిపై వివరాలు తెలిపారు. తమిళనాడు లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణ మార్పువల్ల సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్నాయి. వైపరీత్యాలు వస్తున్నాయి. ఆనకట్టలు, దృఢమైన నిర్మాణాలు చేపట్టడంతో సముద్ర ప్రవాహంతో డెల్టా నుంచి వచ్చే ఒండ్రు మట్టి, ఇసుక రానురాను తగ్గిపోతోంది. ఈ ప్రభావం తగ్గించాలంటే ఇసుక నిర్వహణ సరిగా ఉండాలి. పోర్టుల నుంచి తవ్వితీసే ఇసుకను సముద్రంలో డంప్ చేయకుండా కోతకు గురైన బీచ్‌ల్లో పరిస్తే ఇసుక సమతుల్యత ఏర్పడుతుంది. కోతకు గురైన రాష్ట్రాల్లో తమిళనాడు చాలా అధ్వాన్నంగా ఉంటోంది. సముద్ర భారీ అలల తాకిడికి 22 ప్రాంతాల్లో మొత్తం 1802 హెక్టార్ల లోతట్టు ప్రాంతం శాశ్వతంగా కొట్టుకు పోయింది. తమిళనాడు లోని రెండు జిల్లాల్లో 60 శాతం కోస్తా తీరం కొట్టుకు పోయింది. మరో ఐదు జిల్లాల్లోని బీచ్‌లు ప్రమాదంలో ఉన్నాయని శాటిలైట్ డేటా అధ్యయనం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News