Saturday, December 21, 2024

వైద్య సేవలో రోబో కేటర్‌పిల్లర్

- Advertisement -
- Advertisement -

గొంగళిపురుగు కాళ్ల వంటి కాళ్లుతో చిన్నపాటి మృధువైన రోబోను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది బరువులు ఎత్త గలుగుతుంది. శరీరంలో మందులు సరఫరా చేస్తుంది. హాంకాంగ్ పరిశోధకులు సిలికాన్ మెటీరియల్‌తో, మేగ్నెటిక్ కణాలతో దీన్ని రూపొందించారు. ఇది శరీరంలో సమర్ధంగా మసలాడే రక్తం, శ్లేష్మం, వంటి ద్రవాల్లో కూడా మునిగి తేలగలుగుతుంది. దీనికి మిల్లి మీటర్ కన్నా తక్కువ ప్రమాణం కలిగిన వందలాది మొన తేలిన కాళ్లు ఉంటాయి. పరిశోధకులు నేలపై పాకే వందలాది ప్రాణులను పరిశీలించారు.

2,4,8 ఇంకా ఎక్కువ కాళ్లుండే వాటిని, ఆ కాళ్ల మధ్య ఖాళీలను , కాలి పొడవును పరిశీలించారు. చాలా జంతువుల కాళ్లు పొడవు నుంచి , కాళ్ల మధ్య ఎడం 2ః 1 నుంచి 1ః1 నిష్పత్తి వరకు ఉన్నాయని పరిశోధకులు గమనించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ రోబో శరీరం 0.15 మిమీ వరకు ఉంటుంది. శంఖు ఆకారంలో కాళ్లు ఉంటాయి. ప్రతి కాలి పొడవు 0.65 మిమి పొడవునా, కాళ్ల మధ్య ఎడం సుమారు 0.6 మిమీ వరకు ఉంటుంది.

కాలి పొడవు, కాళ్ల మధ్య ఉన్న ఎడం 1ః 1నిష్పత్తిలో తయారు చేశారు. మొనతేలిన కాళ్లు తాకే ప్రదేశం ఉపరితలం గట్టిగా పట్టి నడుస్తాయి. ఎలెక్ట్రో మేగ్నెటిక్ శక్తిని ఉపయోగించి రిమోట్ ద్వారా రోబోను నియంత్రిస్తారు. మందులు శరీరంలో విడుదలయ్యేలా చూస్తారు. ఎలెక్ట్రో మేగ్నెటిక్ వేగం పెంచడం ద్వారా రోబో స్పీడ్ పెరుగుతుంది. చిన్న చీమకున్న శక్తితో దీని శక్తి పోలి ఉంటుంది. తాను మోయ గలిగిన బరువు కన్నా వంద రెట్లు ఎక్కువ బరువును మోయగలిగే సామర్ధం ఈ రోబోకు ఉంది. నిర్ణయించిన స్థలం వద్దకు ఉదాహరణకు జీర్ణవ్యవస్థ ద్వారా మందులను తీసుకెళ్ల గలుగుతుంది. లేదా వైద్యపరమైన తనిఖీ చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి వ్యవస్థల ద్వారానైనా పనిచేయగలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News