Monday, December 23, 2024

ఫిబ్రవరి 13న రాష్ట్రానికి ప్రధాని మోడీ రాక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బిజెపి బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. నిజానికి ఈనెల 19నే రాష్ట్రంలో మోడీ పర్యటించాల్సివుంది, అయితే ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఈనెల 15న వర్చువల్ విధానంలో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యనట ఫిబ్రవరి 13న ఖరారైంది. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటన ఆసక్తికరంగా మారింది. గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించి బిజెపి సభలో మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ప్రధాని పరీక్ష పే చర్చలో తెలంగాణ విద్యార్ధులు
ఈనెల 27న జరగనున్న ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా అనేక పాఠశాలల విద్యార్ధులు వీక్షించే విధంగా బిజెపి రాష్ట్ర శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు బిజెపి కమిటీ వేసింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఎజెండాలోనూ ఈ అంశాన్ని చేర్చింది. శనివారం పలు పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ సహా ఇతర బిజెపి నేతలు పాల్గొన్నారు. ఈ పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమంలో కేవలం కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనడానికి మాత్రమే అవకాశం ఉంది. దేశం నలుమూలల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని పోటీలను పెట్టి, విజేతలైన వారికి మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుంది.
నికి ప్రధాని మోడీ రాక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News