Monday, December 23, 2024

గ్రూప్2 పరీక్ష కోసం శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్2 పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోడానికి గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. గ్రూప్2 పరీక్షకు 200 మందికి తెలంగాణ బిసి స్టడి సర్కిల్ ఉచిత శిక్షణ ఇస్తుంది. హైదరాబాద్, నయాపూల్‌లోని ప్రభుత్వ సిటి కాలేజీలో ఫబ్రవరి 1వ తేదీ నుండి ద్విభాషలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ సూచించారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్శికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 04027077929, 7780359322 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News