Monday, December 23, 2024

ఎన్నికల ఏడాదిలో భారీ బడ్జెట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే నెల 3 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం ప్రగతి భవన్‌లో బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించా రు. 202320-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖకు వచ్చిన బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలను శాఖల వారీగా సమీక్షించారు. ఈ ప్రతిపాదనల ఆదారంగా రాష్ట్ర వార్షిక బ డ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చనని తెలుస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విశయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరం (202220-23)లో ప్ర భుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉ న్నాయి.

అవి కూడా కలుపుకొంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు లెక్క తేలుతుందని తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాని కి అగ్రతాంబూలం ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీకి ఇ దే సంవత్సరం సాధారణ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఓ కొలిక్కివచ్చిన ప్రాజెక్టులను పూర్తిచేయడమే లక్ష్యంగా, ని ధులు కేటాయించడంతో కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లించేందు కు అవసరమైన నిధులనూ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మిగిలిన శాఖల ప్రతిపాదనలపై కూడా సిఎం కెసిఆర్ దృష్టిసారించనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News