- Advertisement -
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉంటున్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శనివారం స్వామివారిని 78,158 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,090 మంది తలనీలాలను సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
- Advertisement -