Monday, December 23, 2024

చైనాలో వారంలో దాదాపు 13వేల కొవిడ్ మరణాలు

- Advertisement -
- Advertisement -

బీజింగ్: జనవరి 13 నుంచి 19 మధ్య చైనాలో దాదాపు 13000 మంది కొవిడ్ కారణంగా చనిపోయారని అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. చైనాలో చాలా మందికి కొవిడ్ వైరస్ విస్తృతంగా సంక్రమించింది. చైనాలో అంతకు ముందు వారం అంటే జనవరి 12 నాటికి ఆసుపత్రుల్లో దాదాపు 60000 మంది చనిపోయారు. చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సిడిసి) శనివారం తన ప్రకటనలో ఆసుపతుల్లో చేరిన వారిలో ఊపిరాడక 681 మంది చనిపోయారని పేర్కొంది. కాగా కరోనా వైరస్‌తో పాటు ఇతర వ్యాధుల కారణంగా 11977 మంది చనిపోయారు. అయితే ఇంటిలోనే మరణించిన వారిని ఈ జాబితాలో చేర్చలేదు. ఇప్పటి వరకు చైనాలో అంటే జీరో కొవిడ్ పాలసీని డిసెంబర్‌లో ఎత్తేసిన తర్వాత కరోనా వల్ల ఆరు లక్షల మంది చనిపోయారని ‘ఎయిర్‌ఫినిటీ’ అనే స్వతంత్ర సంస్థ అంచనావేసింది.

చైనాలో చాంద్రమాన నూతన సంవత్సరాది సందర్భంగా చాలా మంది తమ కుటుంబ సభ్యులను కలుసుకోడానికి తమతమ ఊళ్లకి వెళ్లారు. దీనివల్ల అక్కడ కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగొచ్చని భయాందోళనలు ఉన్నాయి. అయితే సెకెండ్ వేవ్ చైనాలో లేదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా చైనాలో 80 శాతం జనాభాకు ఇప్పటికే కరోనా వైరస్ సోకింది. చైనాలో దాదాపు 2 కోట్ల మంది ఈ నెల ప్రయాణాలు చేసారని చైనా రవాణా అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News