Saturday, November 23, 2024

వేడుకపై తూటా

- Advertisement -
- Advertisement -

మాంటెరీ పార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. లాస్‌ఏంజెల్స్ సమీపంలోని మాంటెరీ పార్క్‌లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. చైనీయుల లూనార్ న్యూ ఇయర్ ఫెస్టివల్ వే డుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో 10 మం దికి పైగా మృతిచెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరో 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపా రు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అధికారులు ఇం కా గుర్తించలేదు. కాల్పులు జరిగిన సమయంలో అక్క డ వేలాది మంది ఉన్నారు. అందరూ అటపాటల్లో, వేడుకల్లో మునిగి ఉన్న సమయంలో దుండగుడు భారీ మెషిన్ గన్‌తో అక్కడికి వచ్చి కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

దీంతో ఒక్కసారిగా జనం పరుగులు తీశారు. ఘటన జరిగిన వీధిలోనే సియాంగ్ వాన్ చాయి అనే వ్యక్తి బార్ బెక్యూను నిర్వహిస్తున్నారు. రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో రెస్టారెంట్‌లోకి వచ్చి తలుపులు వేసేశారని, బయట ఓ వ్యక్తి మెషిన్ గన్‌తో కాల్పులు జరుపుతున్నారని వారు చెప్పినట్లు సియాంగ్ తెలిపారు. సమీపంలోని డ్యాన్సింగ్ క్లబ్‌ను లక్షంగా చేసుకుని దుండగుడు దాడి చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాత్రి 10.22 గంటల సమయంలో కాల్పులు జరిగాయని, మాంటెరీ పార్క్‌లోని గార్వే అవె వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని లాస్ ఏంజెల్స్ కౌంటీ పోలీసు విభాగానికి చెందిన సార్జెంట్ బాబ్ బోస్ తెలిపారు. లాస్ ఏంజెల్స్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలోని మాంటెరీ పార్క్ కౌంటీలో పెద్ద సంఖ్యలో ఆసియా వాసులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News