Sunday, February 23, 2025

నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసరలో పెనువిషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన మానస అనే మహిళ కుమారుడు బాలాదిత్య (8), కుమార్తె నవ్యశ్రీ (7)తో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గంగా హారతి ఇచ్చే ఘాట్‌ సమీపంలో పిల్లల స్కూల్‌ బ్యాగులు, టిఫిన్‌ బాక్సులను గుర్తించారు. పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత వారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News