లాస్‌ఏంజిల్స్: జేమ్స్ కామెరూన్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ కేవలం ఆరు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల మేరకు టికెట్లు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. చరిత్రలో ఆ మైలురాయిని దాటిన సినిమాలలో ఆరోదిగా నిలిచింది. ‘అవతార్’ సినిమా కంటే ముందు ఆ మార్కును దాటిన సినిమాలలో అవేంజర్స్:ఎండ్ గేమ్, టైటానిక్, స్టార్ వార్స్: ద ఫోర్స్ అవేకన్స్, అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్, వెరైటీ ఉన్నాయి.
ఇప్పటి వరకు అధిక మొత్తంలో వసూళ్లు చేసిన ఆరు సినిమాలలో కామెరూన్ సినిమాలే మూడు ఉండడం విశేషం. ఆయన మూడు చిత్రాలు 2 బిలయన్ డాలర్ల వసూళ్లను దాటాయి. గమనించాల్సిన విషయమేమిటంటే కామెరూన్ పెట్టుకున్న లక్ష్యాన్ని ‘ద వే ఆఫ్ వాటర్’ అధికారికంగా చేరుకుంది.
బాగా డబ్బు వసూలు చేసిన సినిమాలలో ‘స్టార్ వార్స్: ద ఫోర్స్ అవేకన్స్’ 2.07 బిలియన్ డాలర్లు, ‘అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్’ 2.04 బిలియన్ డాలర్లు సాధించాయి. కాగా 13 ఏళ్ల కిందట వచ్చిన తొలి ‘అవతార్’ సినిమా 2.9 బిలియన్ డాలర్ల వసూళ్లతో ఇప్పటికీ ‘ఆల్ టైమ్ హై’ వసూళ్ల సినిమాగా నిలిచి ఉంది. ఇప్పటి వరకు అవతార్ సీక్వెల్ ‘ద వే ఆఫ్ వాటర్’ దేశీయంగా 598 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా 1.4 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ‘కొవిడ్’ వ్యాపించిన ఉన్న సమయంలో కూడా అవతార్ 2 రెండు బిలియన్ డాలర్ల మార్కును దాటేయడం గొప్ప అనే చెప్పాలి.