Monday, December 23, 2024

గ్యాస్ వాడకంపై అవగాహన

- Advertisement -
- Advertisement -

ఝరసంగం: సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో కెఎస్‌ఎస్ ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆధ్వర్యంలో గ్యాస్ వినియోగదారులకు సేఫ్టీ క్లినిక్ పేరిట అవగాహన కల్పించారు. సోమవారం ఎల్గోయి గ్రామంలో గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ఏవిధంగా వాడాలో, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా జాగ్రత్త పడడం ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ఒకవేళ గ్యాస్ లీకేజ్ అవుతున్నట్లు తెలిస్తే వెంటనే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. గ్యాస్ ఇంధనం ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెఎస్‌ఎస్ ఇండియన్ గ్యాస్ డిస్టిబూటర్ మేనేజర్ శ్రీనివాస్ డెలివరీ బాయ్స్ నర్సింలు, సిద్ధన్న, గ్రామ ప్రజలు, గ్యాస్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News