Monday, December 23, 2024

బేగంపేటలో భారీగా నగదు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారులో తరలిస్తున్న భారీ నగదును బేగంపేట పోలీసులు సోమవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. డబ్బులను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గచ్చిబౌలి నుంచి పరేడ్‌గ్రౌండ్ వైపు వెళ్తున్న రెండు కార్లు బేగంపేటలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి కింద ఒక కారు నుంచి మరో కారులోకి డబ్బులు(సుమారు రూ.4కోట్లు) తరలిస్తుండగా పోలీసులు అక్కడికి వచ్చారు. డబ్బులను మారస్తున్న వెంకటేశ్వర్లు, ప్రశాంత్, రిషబౌను పోలీసులు ప్రశ్నించారు.

వారు డబ్బులకు సంబంధించి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని విచారించడంతో రుతు ప్రియ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందినదని చెప్పారు. ముగ్గురు గచ్చిబౌలి నుంచి డబ్బులు తీసుకుని యజమానికి ఇచ్చేందుకు పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్తుండగా మధ్యలో పోలీసులు పట్టుకున్నారు. డబ్బులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News