న్యూఢిల్లీ: కేంద్రం చేస్తున్న ఎడతెగని అప్పులతో దేశం క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఈక్రమంలో దేశప్రజల గుండెలపై వడ్డీల కుంపటి రాజుకుంటుంది. 2014-15లో కేంద్రం తీసుకున్న రుణాలపై వడ్డీగా రూ.4.02లక్షల కోట్లు చెల్లించింది. గత మూడేళ్లుగా వడ్డీల చెల్లింపులో భారీ పెరుగుదల నమోదైంది. 2021-22లో వడ్డీ చెల్లింపులపై కేంద్రం రూ.8.14లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఆ ఏడాది వ్యయం 39.1శాతంలో ఇది 21.6 శాతం. ఆర్థికవేత్తల పోల్ ప్రకారం మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో 16లక్షల కోట్ల రూపాయలు (198బిలియన్ల డాలర్లు)రుణాలు తీసుకోనుంది. కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేక్రమంలో మోడీ సర్కారు భారీగా ఖర్చు చేయడంతో గత నాలుగేళ్లలో ప్రభుత్వ స్థూల రుణభారం రెట్టింపు అయింది. పలు రాష్ట్రాల ఎన్నికలు, 2024లో జాతీ య ఎన్నికల ముంగిట ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అధికార బిజెపి ప్రభుత్వానికి కీలకంగా మారింది.
పన్ను రాబడిలో పతనం, ఆర్థిక వృద్ధి మందగించడం తదితర కారణాల వల్ల సమీప కాలంలో రుణాలను తగ్గించే సామర్థం ప్రభుత్వానికి వడింది. 43మంది వేత్తల మధ్యస్థ అంచ నా ప్రకారం.. 202223లో అంచనా వేసిన 14.2ట్రిలియన్ రూపాయల స్థూల రుణాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 17.2 ట్రిలియన్ రూపాయిలు చేరుకోవచ్చని అంచనా. 2014లో మో డీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు దేశ స్థూల వార్షిక రుణాలు కేవలం 5.92లక్షల కోట్ల రూపాయిలు మాత్రమే. స్థూల రుణాలు ఎక్కువగా ఉం డటానికి ప్రధాన కారణం చెల్లింపు భారం అని ఆర్థికవేత్త ధీరజ్ నిమ్ అన్నారు. కరోనా మ హమ్మారిని అదుపు చేసేందుకు నిధుల కోసం ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలు చాలా రుణాలు తీసుకుంది. తీ సుకున్న రుణాలను చెల్లించే భారం చాలా సంవత్సరాలు కొనసాగుతుంది. పెరిగినవడ్డీ రేట్లు అప్పుగా డబ్బును తిరిగి చెల్లించే భారాన్ని పెంచాయి. రాయిటర్స్ ఆర్థిక వేత్తలు ప్రభుత్వ బడ్జెట్ లోటు 202324లో జిడిపిలో6శాతం తగ్గించగలదని అంచనా వేసినప్పటికి 1970ల సగటు 4నుంచి 5శాతం కంటే ఎక్కువగానే ఉంటుంది.
రుణ స్థిరత్వానికి పటిష్ఠ ప్రణాళిక అవసరం: ఐఎంఎఫ్
అంతర్జాతీయ మానిటరీ ఫండ్ గత నెలలో భారతదేశం అప్పులు స్థిరంగా ఉండేలా చేసేందుకు ఆర్థిక ఏకీకరణ, పటిష్ఠమైన ప్రణాళిక అవసరమని పేర్కొంది. అయితే ఆర్థిక లోటు, ప్రభుత్వ రుణాలు చారిత్రాత్మక గరిష్ఠ స్థాయిలో ఉన్నందున భారతదేశం ఆర్థిక క్రమశిక్షణను సమతుల్యం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆర్థికవేత్త సుజిత్ కుమార్ అన్నారు. ఆర్థిక మందగమనం పన్ను వసూళ్లను తగ్గిస్తుందని కుమార్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ మూలధన వ్యయం రికార్డు స్థాయిలో 8.85ట్రిలియన్ రూపాయలకు, జిడిపిలో దాదాపు 2.95శాతానికి పెరుగుతుందని రాయిటర్స్ పోల్ తెలిపింది. భారీ వ్యయం నేపథ్యంలో వృద్ధి వేగం మందగిస్తుంది.
ప్రపంచ కర్మాగారంగా చైనాకు ప్రత్యామ్నాయంగా మారాలనే ఆశయం నెరవేరాలంటే మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి భారతదేశానికి పుష్కలంగా ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అత్యంత ముఖ్యమైన బడ్జెట్ ప్రాధాన్యతలు రెండింటిని తెలపాలని కోరితే 36మంది ఆర్థిక వేత్తల్లో 18మంది ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల పెట్టుబడిగా పేర్కొన్నారు. మరో 18మంది ఉద్యోగ కల్పన, విద్య, ఆరోగ్య, గ్రామిణాభివృద్ధివైపు మొగ్గు చూపారు. కాగా భారత ప్రభుత్వం ఆహారం, ఎరువుల సబ్సిడీలను 3.7ట్రిలియన్ రూపాయలకు తగ్గించనుంది. ఇది 202223 బడ్జెట్‌లోని 5ట్రిలియన్ రూపాయల స్థాయి కంటే 25శాతం ఎక్కువగా పోల్ తెలిపింది.