Monday, December 23, 2024

తమిళ నటుడు, దర్శకుడు ఇ రామదాస్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఇ రామదాస్ సోమవారం రాత్ర గుండెపోటుతో చెన్నైలో మరణించారు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విచారణై చిత్రంలో నటించిన పాత్రతో ప్రేక్షకులకు చేరువైన రామదాస్ అనేక చిత్రాలలో సహాయ పాత్రలను పోషించినప్పటికీ తన విలక్షణ నటనతో మంచి గుర్తింపు పొందారు. రామదాస్ మృతిని ఆయన కుమారుడు కళైసెల్వన్ తన తండ్రి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు.

విక్రమ్ వేద, ఆరమ్ తదితర చిత్రాలు రామదాస్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. నటుడిగా రాణించడానికి ముందే ఆయన రావణన్, వాఠ్గ జననాయకమ్ వంటి ఇత్రాలకు దర్శకత్వం వహించారు. ఒకేరోజులో నిర్మించి రికార్డు సృష్టించిన స్వయంవరం చిత్రానికి పనిచేసిన దర్శకులలో రామదాస్ కూడా ఉన్నారు. బంధు మిత్రుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని కెకె నగర్‌లోని ఆయన స్వగృహంలో ఉంచారు. సాయంత్రం 5 ంటలకు అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News