- Advertisement -
కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగు చూసింది. కక్కనాడ్ పట్టణం లోని ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2 తరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం లాబొరేటరీకి పంపారు.
నోరో వైరస్ లక్షణాలు డయేరియా, వాంతులు, స్వల్పజ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పిల్లలు బాధపడుతున్నారు. కలుషిత నీరు, ఆహారం వల్ల నోరో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు చెప్పారు.
- Advertisement -