- Advertisement -
ఇంఫాల్: మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో మంగళవారం బిజెపి నేత లైష్‌రామ్ రామేశ్వోర్ సింగ్ కాల్పుల ఘటనలో మృతి చెందారు. సింగ్ బిజెపి అనుబంధమైన మాజీ సైనికోద్యోగుల విభాగం కన్వీనర్‌గా ఉన్నారు. మంగళవారం ఉదయం ఇక్కడి క్షేత్రి ప్రాంతంలోని ఆయన నివాసం ద్వారం వద్దనే దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు తౌబాల్ ఎస్‌పి జోగేష్ చంద్ర తెలిపారు. ఘటనకు సంబంధించి ఇప్పుడు ఓ వ్యక్తిని అనుమానంతో అరెస్టు చేసినట్లు వివరించారు. కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ నెంబరు లేని కారులో వచ్చి సింగ్‌పై అతి దగ్గర నుంచి కాల్పులకు దిగినట్లు వెల్లడైంది.
- Advertisement -