Tuesday, December 24, 2024

హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ డైలీ ఫ్లైట్స్ షురూ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశీయ కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన 13వ గమ్యస్థానంగా హైదరాబాద్‌ను నుంచి సేవలను ప్రారంభించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ విమానయాన సంస్థ హైదరాబాద్ నుంచి- బెంగళూరు, హైదరాబాద్ నుంచి- గోవా మధ్య జనవరి 25 నుండి రోజువారీ విమానాలను నడపనుంది. సంస్థకు చెందిన విమానం క్యూపి1415 25న ఉదయం 11.25 నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(ఆర్‌డిఐఎ) ల్యాండ్ కానుంది. ఫిబ్రవరి 15 నుంచి రెండు అదనపు విమానాలు హైదరాబాద్-బెంగళూరు మధ్య అందుబాటులోకి రానుండగా, హైదరాబాద్ నుంచి రోజువారీగా ప్రయాణించే విమానాల సంఖ్య నాలుగుకు చేరనుంది.

ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ మాట్లాడుతూ, 13వ గమ్యస్థానంగా హైదరాబాద్ నుంచి గోవా, బెంగుళూరుకు రోజువారీ విమానయాన సేవలు ప్రారంభించడం దక్షిణ భారతదేశంలో సంస్థ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్, ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ బెల్సన్ కౌటినో మాట్లాడుతూ, హైదరాబాద్‌కు ఆకాశ అనుభవాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 2022 ఆగస్ట్‌లో ప్రారంభించినప్పటి నుంచి ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన మొత్తం 21 మార్గాలలో 575కు పైగా వీక్లీ విమానాల మైలురాయిని సంస్థ అధిగమించింది. 2023 మార్చి చివరి నాటికి ఆకాశ ఎయిర్ ఫ్లీట్ 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లుగా ఉండనుంది. రాబోయే నాలుగేళ్లలో ఎయిర్‌లైన్ 54 అదనపు విమానాలను జోడించుకుని తన మొత్తం విమానాల సంఖ్యను 72 విమానాలకు తీసుకువెళుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News