Saturday, November 23, 2024

ప్రి లాంచ్ పేరుతో భారీ మోసం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేద, మధ్య తరగతి వారిని టార్గెట్ చేసుకుని తక్కువ ధరకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి భారీగా డబ్బులు మోసం చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎండిని కెపిహెచ్‌బి పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. కూకట్‌పల్లి ఎసిపి చంద్రశేఖర్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కెపిహెచ్‌బికి చెందిన కాకర్ల శ్రీనివాస్, బొళ్ల శ్రీనివాస్‌రావు, మునీశ్వర్, శ్రీనివాస్ కలిసి జయంతి రిలయబిలిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్, సైబరాబాద్ పరిసరాల్లో వ్యాపారం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని భూమి యజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నాడు.

వాటిని అమాయకులకు చూపించి ఇక్కడ భారీ అపార్ట్‌మెంట్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని చెబుతున్నారు. వాటిని నమ్మిన వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే జీడిమెట్లకు చెందిన రవిశ్రీకాంత్ మెట్రో రైలులో ఈ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ పరిచయం అయ్యాడు. తాము కెపిహెచ్‌బి మెట్రోస్టేషన్‌లో షట్టర్లు,గోపన్‌పల్లిలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నామని చెప్పాడు. వాటిని త్వరలో పూర్తి చేస్తామని, ప్రీలాంచ్ నడుస్తోందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు రూ.10లక్షలు చెల్లించాడు. ఈ విషయం తన స్నేహితులకు చెప్పడంతో పూర్ణచందర్ రావు, వెంకటేష్, అర్చన, నమ్రతపండరి తదితరులు కూడా రూ.10లక్షల చొప్పున చెల్లించారు.

ఈ చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితుడు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా మోసం చేశాడు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కెపిహెచ్‌బి పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. శ్రీనివాసరావు, మునీశ్వర్, శ్రీనివాస్ తదితరులు పరారీలో ఉన్నారు. వీరి చేతిలో మోసపోయిన వారు ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. నిందితుడు కాకర్ల శ్రీనివాస్‌పై కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

ఒప్పందాలు చేసుకుని….
నిందితులు పాటి ఘన్‌పూర్, అమీన్‌పూర్, చందానగర్, నిజాంపేట, టోలికట్టా, సదాశివపేట,షాద్‌నగర్, రాయదుర్గం, లింగంపల్లి, సర్దార్‌పటేల్ నగర్ తదితర ప్రాంతాల్లోని భూమి యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పంద పత్రాలు చూపించి పలువురు అమాయకుల వద్ద రూ.20కోట్లు వసూలు చేశారు. బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత భూమి యజమానులతో ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News