Friday, November 22, 2024

హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

- Advertisement -
- Advertisement -

శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఉందన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు గవర్నర్‌ తమిళిసై పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉన్నదని చెప్పారు.

పంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని చెప్పారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారని తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారని వెల్లడించారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయరచయిత చంద్రబోస్‌, బాలలత, ఆకుల శ్రీజతోపాటు పలువురిని గవర్నర్‌ తమిళిసై సన్మానించారు. అంతకుముందు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News