Friday, December 20, 2024

అనారోగ్య సమస్యలతో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో సారంగపూర్ డైరీ ఫార్మ్ వద్ద డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డైరీ డెవలప్మెంట్ శాఖ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండ జిల్లాకు చెందిన శ్రీశైలం గత సంవత్సరం వరంగల్ నుంచి బదిలిపై పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా నిజామాబాద్ కు వచ్చారు.

కొన్ని రోజుల నుంచి అనారోగ్యం సమస్యల ఇబ్బంది పడుతున్నాడు. కాగా బుధవారం తన కార్యాలయంలో తన చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ రాసి శ్రీశైలం ఉరి వేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News