Monday, January 20, 2025

ఏప్రిల్ 27న బద్రీనాధ్ ఆలయం మహాద్వారాల ప్రవేశం

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా లోని పవిత్ర బద్రీనాధ్ ఆలయ మహాద్వారాలు ఏప్రిల్ 27న ప్రవేశానికి తెరుస్తారని అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. బసంత పంచమి సందర్భంగా తెహ్రీ రాజ ప్రాసాదంలో సంప్రదాయ మత ఉత్సవంలో ఈ తేదీ, సమయం నిర్ణయించడమైందని బద్రీనాథ్‌కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వివరించింది.

ఏప్రిల్ 12న నూనెకాడ యాత్ర ప్రారంభమౌతుందని, ఈ సందర్భంగా ఏటా ఆలయం ప్రారంభానికి ముందు నువ్వుల నూనె కాడను ఆలయానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేసింది. విష్ణుదేవుని ఆలయంగా ప్రసిద్ధి చెందిన బద్రీనాధ్ ఆలయాన్ని శీతాకాలంలో నవంబర్ 19న మూసివేస్తారు. శీతాకాలమంతా ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి ప్రారంభంలో ఆలయాన్ని తెరుస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News