Monday, January 20, 2025

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9.315 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్‌కు చెందిన చందన్ నవీన్ అలియాస్ చందన్ నగరంలోని సన్‌సిటీలో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, సుల్తాన్ మాలిక్ డెకరేషన్ పనిచేస్తున్నాడు. ఇద్దరిది ఒకే రాష్ట్రం కావడంతో స్నేహితులుగా మారారు. చందన్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోవడంలేదు.

దీంతో ఒడిసా రాష్ట్రం మల్‌కాన్‌గిరి నుంచి తక్కువ డబ్బులకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ డబ్బులకు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. ఇద్దరు కలిసి గత కొంత కాలం నుంచి గంజాయిని అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. చందన్‌నవీన్ పై గతంలో ఐదు కేసులు ఉన్నాయి. నిందితులు గంజాయి తీసుకుని వస్తున్న విషయం తెలిసిన పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు షేక్ బురాన్, శ్రీశైలం, నరేందర్, నర్సింహులు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News