Monday, January 20, 2025

భక్తులకు అందుబాటులో టిటిడి మొబైల్ యాప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్‌ను టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫ్లాట్‌ఫాంపై అభివృద్ధి చేసిన ఈ యాప్‌కు టిటి దేవస్థానమ్స్ అనే నామకరణ చేశారు. ఈ యాప్ సాయంతో తిరుమలలో స్వామివారి దర్శనం, గదుల బుక్కింగ్, ఆర్జిత సేవా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. అలాగే తిరుమల పుణ్యక్షేత్రం చరిత్ర, శ్రీవారి సేవలు వివరాలు కూడా ఈ యాప్‌లోనే ఉంటాయి. టిటిడి ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యక్రమాలను కూడా ఈ యాప్‌లోనే వీక్షించే సౌలభ్యం ఉంది.

గతంలో టిటిడి గోవింద అనే పేరుతో యాప్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ యాప్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా టిటి దేవస్థానమ్స్ యాప్‌ను రూపొందించారు. ఇదివరకే గోవింద యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు కొత్త యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే టిటి దేవస్థానమ్స్ యాప్‌లోకి అటోమెటిగ్గా ఎంటరవుతాయని టిటిడి అధికారులు తెలిపారు. అలా సాధ్యపడకపోతే నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి టిటి దేవస్థానమ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News