Sunday, December 22, 2024

టాపిక్ డైవర్ట్ చేసి 18లక్షల డైమండ్‌ను కొట్టేసిన దొంగ..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అటెన్షన్ డైవర్ట్ చేసి డైమండ్‌ను చోరీ చేసిన అంతరాష్ట్ర నిందితుడిని అఫ్జల్‌గంజ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.18లక్షల విలువైన డైమండ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కర్నాటక రాష్ట్రం, చిక్కబళ్లురు జిల్లాకు చెందిన మహ్మద్ రూహిళ్ల జెమ్ స్టోన్స్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో మూసివేశాడు. ఈ క్రమంలోనే ఇండియా మార్ట్‌లో డైమండ్ విక్రయాల గురించి చూశాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు దానిని విక్రయించే వారిని సంప్రదించాడు. డైమండ్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు వారికి చెప్పాడు. దీంతో డైమండ్‌ను తీసుకుని విక్రేతలు హైదరాబాద్‌కు వచ్చారు.

నిందితుడు అఫ్జల్‌గంజ్‌లోని అంబికా లాడ్జీలో బస చేశాడు. ఈ నెల 25వ తేదీని రూహిళ్ల వద్దకు వచ్చిన బాధితులు డైమండ్స్‌ను చూపించారు. వాటిని చూసిన నిందితుడు వాటిని కొనుగోలు చేస్తానని చెప్పాడు. కొంత సమయం తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పడంతో బాధితులు సికింద్రాబాద్‌లోని మరో కస్టమర్‌కు చూపించేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లి బాక్స్‌ను చూసేసరికి అందులో నకిలీ డైమండ్ ఉంది. వెంటనే బాధితులు అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితులు డైమండ్స్ చూపిస్తున్న సమయంలోనే నిందితుడు హోటల్ హౌస్ కీపింగ్ వారిని పిలిచి వారి దృష్టి మరల్చాడు. అదే సమయంలో అసలు డైమండ్ ఉన్న బాక్స్‌ను తీసుకుని నకిలీ బాక్స్‌ను వారికి ఇచ్చాడు. నిందితుడిని కర్నాటకలో అరెస్టు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. ఇన్స్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, డిఐ సతీష్ కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News