Sunday, January 19, 2025

ఫుడ్ పాయిజన్: 30మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం నుంచి వాంతులు, కడుపునొప్పితో సుమారుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు బాధపడుతున్నా సకాలంలో పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడంతో బాధపడిన విద్యార్థుల సంఖ్య పెరిగింది.

పండుగ సెలవులకి వెళ్ళిన విద్యార్థులు పాఠశాలకు తెచ్చుకున్న తినుబండారాలు, హోమ్ ఫుడ్స్ వల్లే పిల్లలకు వాంతులు అయ్యాయని ప్రిన్సిపాల్ చంద్రబాబు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కొందరిని స్థానికంగా పాఠశాలలోనే చికిత్స అందించగా మరికొందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లి తెచ్చుకున్న హోమ్ ఫుడ్స్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ చంద్రబాబు తెలిపారు. విద్యాలయంలో 30మంది విద్యార్థులకు అస్వస్థత గురైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతికి ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తీసుకువచ్చిన తినుబండారాలు పాయిజన్ కావడంవల్ల విద్యార్థులకు విరోచనాలు, వాంతులు, కడుపులో నొప్పి వచ్చినట్లు తెలిపారు. అస్వస్థకు గురైన పిల్లలకు తక్షణమే చికిత్స అందిస్తున్నామన్నారు. విద్యార్థులు తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోరుకుంటున్నారని ఎటువంటి ప్రమాదంలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News