Saturday, November 23, 2024

తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు ప్రధాని మోడీ ఆసక్తికర సమాధానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పరీక్షాపే చర్చ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన అక్షర అనే విద్యార్థిని మోడీని బహు భాషలపై పట్టు సాధించడానికి ఏం చేయాలని ప్రశ్నించింది. దీనికి మోడీ సమాధామిస్తూ ఓ ఉదాహరణను వివరించారు. ‘కార్మికులు నివసించే బస్తీలోని ఓ ఎనిమిదేళ్ల బాలిక మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం మాట్లాడడం నన్ను ఆశ్చర్యపరిచింది. అసలు ఆ బాలికకు అన్ని భాషలు మాట్లాడడం ఎలా సాధ్యమైందా అని ఆరా తీశా.

ఆ చిన్నారి ఇంటిపక్కన నివసించేవారు ఒక్కో రాష్ట్రానికి చెందిన వారు. ఎక్కడినుంచో బతుకుతెరువు కోసం వచ్చిన వారంతా ఒక చోట నివసించడంతో ఆ బాలిక రోజూ వారితో మాట్లాడుతుండేది. ఆ క్రమంలోనే ఆమెకు అన్ని భాష లు వచ్చాయి. ఆ చొరవ మెచ్చుకోదగ్గది. ఇత ర భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే చాలు’ అంటూ ఆయన సమాధానమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News