- Advertisement -
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు చిన్న శేష వాహనం పై తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో మలయప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
గ్యాలరీల్లో వాహన సేవలను తిలకించే భక్తులకు షెడ్ల నిర్మాణం చేశారు. షెడ్లలో భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఎస్ఎస్డి టోకెన్లు, విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -