Monday, December 23, 2024

బాలికను గర్భవతి చేసిన బాలుడు

- Advertisement -
- Advertisement -

రంగా రెడ్డి రాజేంద్రనగర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేసి గర్భవతిని‌ చేశాడు. బాలికను బెదిరించి గత మూడు నెలలుగా బాలిక పై అత్యాచారం చేస్తుండడంతో బాలిక అనారోగ్యానికి గురైంది. బాలికను తల్లి నిలదీయడంతో వరుసకు బావ అయిన మైనర్ బాలుడు తన పై అఘాయిత్యానికి పాల్పడినట్లు తల్లికి బాలిక తెలిపింది. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో బాలికను పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి తెలిపారు. , బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News