Saturday, November 9, 2024

గరుడవాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం

- Advertisement -
- Advertisement -

తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా మూడో వాహనమైన గరుడ వాహనసేవ వేడుకగా జరిగింది. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం (ఉదయం 11 నుండి 12 గం||ల వరకు)  పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు ఇత‌ర టిటిడి అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News