Monday, January 20, 2025

బావిలో పడ్డ కోళ్లను తీయడానికి వెళ్లి బావిలో పడ్డ వ్యక్తి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి ఇనుప చువ్వలు గుచ్చుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలోని జహిరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం రాము రాథోడ్ అనే వ్యక్తి బావిలో పడ్డ కోళ్లను తీయడానికి బావిలోకి దిగాడు. బావిలోకి దిగిన రాము కోళ్లను తాళ్లకు కట్టి పైకి పంపించాడు. అనంతరం తాను తాడును పట్టుకొని పైకి వస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందకు పడి పోయాడు.

ఈ క్రమంలో రాము కి బావిలో ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకున్నాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాము కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించాడు. అనంతరం స్థానికులు క్రేను సహాయంతో రాముని బయటకు తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాము పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News