Tuesday, January 21, 2025

రెండో టి20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌

- Advertisement -
- Advertisement -

లక్నో: భారత్ – కివీస్ మధ్య మరికాసేపట్లో జరుగబోతున్న రెండో టి20 లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్‌తో లక్నో వేదికగా జరిగే రెండో టి20 భారత్‌కు సవాల్‌గా మారింది. రాంచీ టి20లో ఓటమి పాలైన టీమిండియాకు ఈ మ్యాచ్ పరీక్షగా తయారైంది.

సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇందులో గెలువడం తప్పించి మరో మార్గం లేకుండా పోయింది. మరోవైపు మొదటి టి20లో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News