- Advertisement -
బడ్జెట్ కు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చేలా గవర్నర్ ను ఆదేశించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఫబ్రవరి 3వ తేది నుంచి అసెంబ్లీ ఉన్నందున అత్యవసర విచారణ జరపాలని హైకోర్టుని ప్రభుత్వం కోరింది, గవర్నర్ కు కోర్టు నోటీసు ఇవ్వగలదా లేదా అని ఆలోచించుకోవాలని ఏజికి హైకోర్టు సూచించారు. కోర్టులు మితిమీరి జోక్యం ఉందని మీరే అంటారు , గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చా అని హైకోర్టు ప్రశ్నించడంతో సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టు అడిగిన ప్రశ్నలకు వాదనలు వినిపించారు. దీంతో మద్యాహ్నం 1 గంట వరకు విచారణ జరిపేందుకు సీజే ధర్మాసం అంగీకారం తెలిపింది.
- Advertisement -