తన మేధస్సుతో ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన ఘనుడు రామానుజాచార్యులు అని చిన్నజీయర్ స్వామి అన్నారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ రామానుజచార్య మహామూర్తిని ఆవిష్కరించుకుని సంవత్సరం అవుతుందని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదిన సమతా మూర్తి మొదటి వార్షికోత్సవం మొదలు కాబోతుందని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది సమతా కుంభ్ పేరుతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు.హరిజనులు, దళితులకు సైతం ఆలయాల్లో సేవ చేసు అవకాశానికి కారణం రామానుజాచార్యులని చిన్నజియర్ అన్నారు.
ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు , ముచ్చింతల్ లోని శ్రీ రామనగరంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పద్మభూషణ్ అవార్డు కోసం మీ పేరు సూచిస్తున్నారు మీకు ఏమైన అభ్యంతరమా అని అడిగాగా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. పద్మభూషణ్ అవార్డు నేను కోరలేదు కానీ రావడం పట్ల సంతోషంగా ఉందని చిన్నజియర్ స్వామి అన్నారు.