Monday, December 23, 2024

మహిళలకు సెర్వైకల్ క్యాన్సర్ డేంజర్

- Advertisement -
- Advertisement -

నిరోధానికి స్వదేశీ సంస్థ ‘సీరం’ తయారీ వ్యాక్సిన్ “సెర్వావాక్ ”రెడీ
ప్రపంచం మొత్తం మీద మహిళల్లో 16 శాతం మంది భారత్ లోనే ఉన్నారు. వీరిలో నాలుగో వంతు మంది గర్భాశయ క్యాన్సర్ ( సెర్వైకల్ క్యాన్సర్ ) బాధితులవుతున్నారు. ప్రపంచం మొత్తం మీద గర్భాశయ మరణాల్లో మూడో వంతు మరణాలు భారత్‌వే. ఇటీవలి అంచనాల ప్రకారం భారత్‌లో ఏటా 80,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బాధితులవుతుండగా, 35,000 మంది మృత్యువాత పడుతున్నారు. అయితే దీన్ని నిరోధించడానికి హెచ్‌పివి ( హ్యూమన్ పాపిలోమా వైరస్) అనే వ్యాక్సిన్ అవసరం అవుతుంది.

కానీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద మూడు విదేశీ సంస్థలే ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. వీటిలో రెండు సంస్థలు ఈ వ్యాక్సిన్ డోసులను భారత్‌కు అమ్ముతున్నాయి. ఒక్కోడోసు మార్కెట్‌లో రూ.4000 కు మించి ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో స్వదేశీయంగా వ్యాక్సిన్ తయారీకి భారత్ ప్రోత్సాహం అందించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సెర్వావాక్ (cervavac) అనే పేరుతో హెచ్‌పివి వ్యాక్సిన్‌ను తయారు చేసింది. జనవరి 24న ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించారు. ఇది మార్కెట్‌లో అందుబాటు లోకి వస్తే ఒక్కో డోసు రూ.200 నుంచి రూ. 400 కే లభ్యమవుతుందని సీరం సంస్థ చెబుతోంది.

ఇదిలా ఉండగా 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను అందించడానికి భారత ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈమేరకు ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌పివి వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి ఏప్రిల్‌లో టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తోంది. గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా లైంగికంగా సంక్రమించే వ్యాధి. చిన్నవయసు లోనే లైంగిక సంబంధాలు ఉన్నా, బాల్యం లోనే గర్భం దాల్చినా, ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు ఉన్నా గర్భాశయ క్యాన్సర్ రాడానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

పేదరికం, జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోక పోవడం, పోషకాహార లోపం, ధూమపానం, రోగనిరోధక వ్యవస్థ బలహీనం వంటివి కూడా గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంటాయి. హెచ్‌ఐవి, ఎయిడ్స్, క్లమిడియా వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులు , అధిక సంఖ్యలో ప్రసవాలు, కూడా ఈ క్యాన్సర్‌కు దోహదం చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రాథమిక దశ లోనే దీన్ని గుర్తిస్తే స్త్రీ జీవితాన్ని కాపాడవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ ముఖ్యమైన లక్షణాలు సెక్స్ సమయంలో తీవ్రమైన నొప్పి, స్త్రీ జననాంగాల నుంచి దుర్వాసన, లైంగిక సంపర్కం తరువాత జననేంద్రియాల నుంచి రక్తస్రావం, రుతుక్రమంలో లోపాలు, ఆకస్మికంగా రక్తస్రావం, మల, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, అతిసారం, విపరీతమైన అలసట, బరువు తగ్గడం, ఆహారంపై కోరిక తగ్గడం, కడుపు నొప్పి, తదితర లక్షణాలు కనిపిస్తే గర్భాశయ క్యాన్సర్ లక్షణాలుగా అనుమానించవచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం చేయకుండా గైనకాలజిస్టు సలహాపై కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకుంటే పెరుగుదలను అరికట్టడానికి వీలవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోడానికి స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ రెండు శక్తివంతమైన మార్గాలు. అయితే దీనిపై అవగాహన చాలా తక్కువ. 10 శాతం కంటే తక్కువ మంది మహిళలు మాత్రమే స్క్రీనింగ్ చేయించుకుంటారు.

2945 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు ప్రతి మూడు సంవత్సరాల కొకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. అలాగే 5060 సంవత్సరాల వయసులో ఉన్న వారు ఐదేళ్ల కొకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెక్సులో పాల్గొన్న ప్రతిసారీ కండోమ్ వాడాలని, పొగతాగకూడదని, అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీసీ) సూచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News