Friday, December 20, 2024

పెట్రోల్ బంకును తనిఖీ చేసిన జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో ఉన్న బద్రీనాథ్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ పంపుపై కేసు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సంజయ్ కృష్ణ తెలిపారు. ఆయన పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం డీజిల్ డెడ్ స్టోరేజీ కి రాగానే ఆటోమేటిక్ లాక్ కాకపోవడంతో వినియోగదారులకు డీజిల్ విక్రయించగా, తక్కువ డీజిల్ మాత్రమే రావడంతో మెయింటెనెన్స్ ఇతర విషయాలపై కేసు నమోదు చేసినట్లు సంబంధిత డీజిల్ నాజిల్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇండియన్ ఆయిల్ టెక్నీషియన్ ఎం.కిషోర్ కుమార్ పరిస్థితిని వివరించారు. డీజిల్ తక్కువగా ఉన్నప్పుడు లాక్ కాకపోవడం వలన ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News