హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాష్ట్ర శాసనసభ రెండో సమావేశానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు నాలుగో సమావేశపు ఎనిమిదో సెషన్ జరుగనుంది.
శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సోమవారం గవర్నర్‌కు ఆహ్వానం పంపగా, వార్షిక ఆర్థిక బడ్జెట్, తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయడానికి ఆమె ఆమోదించారు. ఇదిలావుండగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రభుత్వ అధికారులు సోమవారం హైకోర్టులో పిటిసన్ వేశారు. అయితే సంబంధిత న్యాయవాదులు రాజీ కుదుర్చుకోవడంతో పిటిషన్‌ను అదే రోజున క్లోజ్ చేశారు. గవర్నర్‌తో సమావేశానికి ముందు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి చర్చలు జరిపారు. తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఆర్థిక) కె. రామకృష్ణారావు, శాసనమండలి కార్యదర్శి వి. నరసింహాచార్యులుతో కలిసి గవర్నర్‌ను కలిశారు. తదనంతరం అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని గవర్నర్‌కు ప్రతిపాదన పంపారు, దానిననుసరించి గవర్నర్ ఈ వారం అసెంబ్లీ సమావేశాన్ని పిలిచారు.గత ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడంతో ఆమె నుంచి తీవ్ర ప్రతిచర్య చోటుచేసుకుంది. అయితే ఇది కొత్త సెషన్ కాదని, ఇదివరకటి సెషన్‌కు కొనసాగింపని బిఆర్‌ఎస్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది.
ఫిబ్రవరి 3న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరో నాలుగు రోజులే మిగిలి ఉండడంతో బడ్జెట్‌కు గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి అసెంబ్లీ, మండలి ఆమోదించిన ఏడు బిల్లులు రాజభవన్‌లోనే మగ్గుతుండడంతో బిఆర్‌ఎస్ నాయకులు సంక్షోభాన్ని అంచనా వేశారు. బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండడంతో ప్రభుత్వం మినహాయింపును పొందింది. గవర్నర్ ప్రసంగానికి, బడ్జెట్ సమర్పణకు సంబంధం లేని అంశాలని వాదించింది. అంతేకాక బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగించాలనే నిబంధన రాజ్యాంగంలో లేదని కూడా పేర్కొంది.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 202ని ఉదాహరించింది. అది ఒక ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర అంచనా వసూళ్లు, ఖర్చుల ప్రకటనను సభ ముందు ఉంచడానికి గవర్నర్ తప్పనిసరి అనుమతి ఇవ్వాలి. ఇదిలావుండగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య వాగ్వాదం కొత్త మలుపు తిరిగింది.