Monday, December 23, 2024

విద్యుత్ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ ఎన్.శివాజీ ఆధ్వర్యంలో టీఈఈజేఏసీప్రతినిధులు మంగళవారం మంత్రి జగదీష్ రెడ్డిని మింట్ కంపౌండ్‌లోని ఆయన చాంబర్‌లో కలిశారు. విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ఇప్పటికే 10 నెలలు ఆల్యస్యమైందని, వెంటనే పిర్సీ ప్రకటించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ కోసం చిన్న ఉద్యోగులు, ఆర్టిజన్ కార్మికులతో పాటు విద్యుత్ ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్న అంశాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పీఆర్సీతో పాటు ఈపిఎఫ్ నుంచి జిపిఎఫ్ మార్పు, హెచ్‌ఆర్‌ఏ, ఇటీవల తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలలో 166 మంది ఇంజనీర్లకు రివర్షన్ ఇచ్చిన అంశాన్ని ఆయన మంత్రికి వివరించారు.

అంతే కాకుండా రివర్షన్ అయిన వారిని ఎక్కడకు ఎలా సర్దుబాటులో చేయాలో కూడా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లకు ఒక్కరికి కూడా అన్యాయం జరగనివ్వమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. రివర్షన్ వచ్చిందని ఆందోళ చెందాల్సిన అవసరం వద్దని, కొంత జాప్యం జరిగినా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పీఆర్సీ అంశంలో ఆలస్యమైన నిర్దేశించిన పిఆర్సీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగులంటే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు మొదటి నుంచి అభిమానమే అని ఆయన వారెప్పుడు అన్యాయం చేయరన్నారు.

ఉద్యోగుల రివర్షతో పాటు పీఆర్సీ ఎంతో ఇవ్వచ్చు, ఈపీఎఫ్ నుంచి జీపిఎఫ్‌కు పరిష్కారం తదితర అంశాలపై సీఎండి ప్రభాకర్‌రావుతో చర్చించి తాము ఇద్దరం సీఎం కేసిఆర్‌కు వివరాలను తెలుపుతామన్నారు. విద్యుత్ ఉద్యోగులపై సీఎం కేసిఆర్‌కు ఉన్న సానుకూల దృక్పథమే ఉద్యోగులకు అనుకూలంగా వచ్చే నిర్ణయం వెలువడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర నుంచి రావాల్సిన సహాయ సహకారాలు లభించక పోయినప్పటికి విద్యుత్ ఉద్యోగుల పనితీరుపై సీఎం సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో టిజాక్ కన్వీనర్ ఎన్.శివాజీ,రామేశ్వరయ్య శెట్టి,మాతంగి శ్రీనివాస్, ఆరోగ్యరాణి, నాజర్ షరీఫ్, తుల్జారాం సింగ్, సురేందర్ రెడ్డి, తిరుపతయ్య,కరెంట్‌రావు, కార్తీక్, భాస్కర్, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News