Saturday, December 21, 2024

అమెజాన్ వెబ్ సర్వీసెస్ లోకి మాజీ సైనికుడు రవి రెడ్డి..

- Advertisement -
- Advertisement -

విజయవంతమైన కార్యాచరణలకు నేతృత్వం వహించి, ఏళ్ల తరబడి దేశానికి సేవ చేస్తూ వచ్చిన సైనిక అనుభవజ్ఞులు తరచూ విభిన్న కెరీర్ మార్గాలను అన్వేషిస్తారు. తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలని కోరుకునే వారు తమ అనుభవ సారాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. అమెజాన్‌లో, వందలాది మంది అనుభవజ్ఞులు కొత్త ఆవిష్కరణలు చేస్తూ, తమ అనుభవంతో వినియోగదారులకు మెరుగైన, ఉన్నత సేవలు అందిస్తున్నారు. అమూల్యమైన అనుభవాలతో సిద్ధంగా ఉంటూ, వారు తమ పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు నాయకత్వ సామర్థ్యాలను అనేక రకాల పాత్రలకు విస్తరిస్తున్నారు. సైనిక నిపుణలతో బలమైన నిర్మాణం, అంకితమైన ప్రోగ్రామ్‌తో, అమెజాన్ ఇండియా వారిని స్వాగతించింది మరియు కార్పొరేట్ ప్రపంచంలో తమ కెరీర్‌కు క్రియాశీలకంగా మార్చుకునేందుకు వారికి సహాయపడుతోంది.

ఇండియన్ ఆర్మీలో 22 ఏళ్లకు పైగా పోరాట, సాంకేతిక అనుభవం కలిగిన రవి రెడ్డి తన పదవీ విరమణ అనంతరం, 2020లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వినూత్న వాతావరణంలోకి అడుగు పెట్టారు. సైన్యంలో పని చేసిన సమయంలో సియాచిన్, తూర్పు సిక్కింలో ఎత్తైన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, రాజస్థాన్, పంజాబ్‌లో పశ్చిమ సరిహద్దులతో సహా వివిధ భౌగోళిక ప్రాంతాలలో ఆయన ఆర్మమెంట్ టెక్నాలజీ ఆఫ్ ఆర్టిలరీ & ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ప్రధాన యుద్ధ ట్యాంకుల వినియోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వివిధ హోదాలలో సేవలు అందించారు.

భారతదేవంలోని అమెజాన్‌లో రవి ప్రస్తుతం AWS కమర్షియల్ సేల్స్ కోసం ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ ఆయన అగ్రశ్రేణి బి-స్కూల్స్‌లోని ప్రతిభకు సంస్థలో సేల్స్ మరియు స్ట్రాటజీలో వృత్తిని కొనసాగించేందుకు తన సహకారాన్ని అందిస్తున్నారు. సైన్యంలో అభ్యాసాలు, అనుభవాలతో పాటు అమెజాన్ ఇండియా టీమ్ నుంచి తనకు లభిస్తున్న మద్దతుతోనే విజయాన్ని అందుకోవడం సాధ్యమైందని తెలిపారు.

దీని గురించి రవి మాట్లాడుతూ, ‘‘సేల్స్‌ విభాగంలో వృత్తిని కొనసాగించడం సైనిక నిపుణులకు సాధారణమైన అంశం కాదు. సాయుధ దళంలో 2 దశాబ్దాలకు పైగా దళాలతో పనిచేసిన నాకు ఇది నిజంగా ఊహించని కెరీర్ ఎంపిక. అయితే ఈ మార్పు చేసుకునేందుకు మొదట్లో నేను చాలా సంకోచించాను. కానీ AWS బృందం, ఇతర లీడర్ల నుంచి ప్రశంసనీయమైన మద్దతు లభించింది. ఇది నిజంగా అందరినీ కలుపుకుని వెళ్లే వైవిధ్యత కలిగిన సంస్థగా నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

దీని గురించి మరింత వివరిస్తూ, “అమెజాన్‌లో విభిన్నమైన సంస్కృతి, ఆవిష్కరణ, ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వ్యక్తిగత సహకారాన్ని అందించే పాత్రలో పనిచేసేందుకు నాకు ప్రత్యేకమైన అవకాశం లభించింది. ఇక్కడ నేను భారతదేశంలోని AWS కోసం కొన్ని వ్యూహాత్మక ప్రాజెక్ట్‌లలో, ఉద్యోగులకు నాయకత్వం వహించే పాత్రలో పనిచేశాను. దేశంలోని బి-పాఠశాలల నుంచి అత్యుత్తమ ప్రతిభావంతుల బృందానికి నాయకత్వం వహిస్తూ, శిక్షణ ఇస్తూ, వారి ఆలోచనలను మెరుగుపరిచేలా నా అనుభవాన్ని పెట్టుబడి పెడుతున్నాను.

ఈ అవకాశాలు అమెజాన్‌లోని నాయకులకు మిలిటరీ వెటరన్స్‌పై ఎక్కువ నమ్మకాన్ని ఉంచడం, విజయంపై వారికి ఉన్న తపనను సూచిస్తోంది. సైన్యంలో ఉన్నప్పుడు, నేను ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మరియు నా దేశానికి సేవ చేసే మార్గాలను ఎలా కనుగొనాలో నేర్చుకున్నాను. అమెజాన్‌లో మేము మా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు పరిష్కారాలను కనుగొనడం ద్వారా వారి తరపున నిరంతరం ఆవిష్కరణలు చేస్తున్నాము. శ్రేష్ఠత స్థాయిని పెంచడంపై స్థిరమైన దృష్టి పెట్టడంతో ప్రతిరోజూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు నన్ను ప్రేరేపించేది’’ అని వివరించారు.

పని ముగిసిన తర్వాత, రవి తన కుటుంబం, స్నేహితులతో సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నారు. రన్నింగ్, సైక్లింగ్ మరియు అప్పుడప్పుడు బాస్కెట్‌బాల్ ఆటతో తన ఫిట్‌నెస్‌ను ఆయన ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు.

అమెజాన్ ఇండియా తన సైనిక కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా సైనిక నిపుణులు, వారి కుటుంబాలకు పని అవకాశాలను సృష్టిస్తోంది. సాయుధ దళాలకు చెందిన అనుభవజ్ఞులు ఏ సంస్థకైనా అమూల్యమైన ఆస్తి. వారు విజ్ఞాన సంపదను మరియు విస్తృత శ్రేణి నైపుణ్యాలను తీసుకువస్తారు. అమెజాన్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్ (DGR), ఇండియన్ నేవల్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ (INPA), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ (IAFPA), మరియు ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ (AWPO)తో మిలిటరీ సర్వీస్ నుంచి పదవీ విరమణ చేసే వారి వివరాలు తెలుసుకుని, వారిని తమ సంస్థలో భాగస్వాములను చేస్తోంది. దేశవ్యాప్తంగా అమెజాన్‌లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అమెజాన్ ఇండియాలో, అమూల్యమైన అనుభవం, విశిష్ట నైపుణ్యాల కలయికతో, సైనిక అనుభవజ్ఞులు విభిన్నమైన ప్రతిభను కలిగి ఉన్నారు. ఇది సంస్థ వైవిధ్యం. ఈక్విటీ మరియు చేరికకు సంబంధించిన నిబద్ధతను బలపరుస్తుంది. కొన్నేళ్లుగా అమెజాన్ ఇండియా తన వ్యాపారాలలో అనేక విభాగాలలో సైనిక నిపుణులను నియమించుకుంది. భారత్‌లో 2025 నాటికి 100,000 మంది సైనిక నిపుణులను, సైనికుల జీవిత భాగస్వాములను నియమించుకోవాలనే అమెజాన్ దృష్టి కోణానికి అనుగుణంగా, భారతదేశానికి సేవ చేసిన వారు కార్పొరేట్ జీవితానికి మారేందుకు మరియు అమెజాన్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు గొప్ప అవకాశాలను అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News